పూరి మళ్లీ బాలయ్యతోనే..!

క్రేజీ డైరక్టర్ పూరి జగన్నాథ్ పైసా వసూల్ తర్వాత తన సినిమా మళ్లీ బాలకృష్ణతోనే ఉండే అవకాశం ఉందని అంటున్నారు. పైసా వసూల్ సెట్స్ మీద ఉన్నప్పుడే బాలకృష్ణకు మరో కథ వినిపించాడట పూరి. 100 సినిమాలను పూర్తి చేసుకున్న బాలకృష్ణ 101వ సినిమా నుండి స్పీడ్ పెంచేశారు. పైసా వసూల్ వెంటనే కె.ఎస్ రవికుమార్ తో సినిమా షురూ చేసిన బాలయ్య 103వ సినిమా పూరి డైరక్షన్ లో చేయబోతున్నాడట. 

బాలకృష్ణ రవికుమార్ సినిమా పూర్తయ్యే లోపు తనయుడు ఆకాష్ ను హీరోగా పెట్టి సినిమా చేస్తా అంటున్నాడు పూరి జగన్నాధ్. ఇప్పటిదాకా చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసుకుంటూ వచ్చిన ఆకాష్ ఆంధ్రాపోరి సినిమాతో లీడ్ రోల్ చేసినా లాభం లేకుండా పోయింది. అందుకే తనయుడిని హీరోగా నిలబెట్టే క్రమంలో తనే నడుం బిగించాడు. మరి పూరి తన సొంత కొడుకుని పెట్టి తీసే సినిమా రేంజ్ ఎలా ఉండబోతుంది. ఆ సినిమాతో పూరి మళ్లీ తనని తాను ఎలా ప్రూవ్ చేసుకుంటాడు అన్నది త్వరలో తెలుస్తుంది.