
సూపర్ స్టార్ మహేష్ కొరటాల శివతో చేస్తున్న భరత్ అను నేను తర్వాత వంశీ పైడిపల్లితో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా ఇలియానాను తీసుకుంటున్నారని సోషల్ మీడియాలో ఒకటే డిస్కషన్స్ పెట్టేశారు. పోకిరి కాంబో రిపీట్ అవుతుందని మీడియా కోడై కూసింది. ఈ విషయంపై క్లియర్ కట్ గా చెప్పారు ఆ సినిమా నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు. మహేష్ పక్కన ఇంకా హీరోయిన్ ను సెలెక్ట్ చేయలేదని చెప్పిన దిల్ రాజు ఇలియానా అయితే అయ్యే ఛాన్స్ లేదని అంటున్నారు.
ఇక ఈమధ్య డిజెతో లైం లైట్ లోకి వచ్చిన పూజా హెగ్దె మహేష్ పక్కన నటించే అవకాశాలున్నాయని తెలుస్తుంది. అల్లు అర్జున్ తో దువ్వాడ జగన్నాధం సినిమాలో నటించిన పూజా తెలుగులో మొదటి హిట్ అందుకుంది. మరి మహేష్ తో అమ్మడు సినిమా కన్ఫాం అయితే కనుక ఇక స్టార్ రేసులో పూజా కూడా చేరిన్నట్టే లెక్క. 2018 సమ్మర్లో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా నిర్మాణంలో అశ్వనిదత్ కూడా భాగస్వామ్యం అవుతున్నారు.