హరితేజకు లక్కీ ఛాన్స్..!

బుల్లితెర మీద తన చాలాకి నటనతో త్రివిక్రం ను ఫిదా చేసిన హరితేజ అఆ సినిమాతో సిల్వర్ స్క్రీన్ మీద కూడా తన సత్తా చాటుకుంది. ఇక ఆమెను మర్చిపోకుండా ఆ వెంటనే బిగ్ బాస్ షోలో సెలెక్ట్ చేసి మరింత ఛాన్స్ ఇచ్చారు. ప్రస్తుతం బిగ్ బాస్ లో ఉన్న క్రేజీ కంటెస్టంట్స్ లో హరితేజ ఒకరు. ముఖ్యంగా ఫీమేల్ కంటెస్టంట్స్ లో హరితేజ మేల్ హౌజ్ మెట్స్ కు మంచి పోటీ ఇస్తుందని తెలుస్తుంది.

ఇక ఎన్.టి.ఆర్ కూడా హరితేజలోని నటిని చూసి ముగ్ధుడయ్యాడట. ముఖ్యంగా హరితేజ రీసెంట్ గా బిగ్ బాస్ లో చెప్పిన బుర్ర కథకు ఫ్లాట్ అయిన తారక్ త్వరలో తను త్రివిక్రం కాంబినేషన్ లో చేయబోతున్న సినిమాలో మంచి రోల్ ఇచ్చేలా చూస్తున్నాడట. త్రివిక్రం కూడా హరితేజకు ఆల్రెడీ అఆలో చేసిన అనుభవం ఉంది కాబట్టి ఆమె కోసం ఓ మంచి రోల్ వెయిట్ చేస్తుందట. మొత్తానికి బిగ్ బాస్ తో హరితేజ తన కెరియర్ ను మంచి గాడిలో పడేలా చేసుకుందని చెప్పొచ్చు.