బాలీవుడ్ అర్జున్ రెడ్డి ఎవరంటే..!

ఈమధ్య రిలీజ్ అయిన విజయ్ రెడ్డి సినిమా అంచనాలను మించి వసూళ్లను రాబట్టింది. సందీప్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో షాలిని హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా వసూళ్ల ప్రభంజనం చూసి సినిమాను రీమేక్ చేయాలని ఇతర భాషల వారు తొందరపడుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే కోలీవుడ్ నుండి ధనుష్ ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ చూపడం సినిమా కొనేయడం అంతా జరిగాయట.

ఇక బాలీవుడ్ లో కూడా అర్జున్ రెడ్డి రీమేక్ ప్రయత్నాలు జరుగుతున్నాయట. అర్జున్ రెడ్డి టాక్ చూసి బాలీవుడ్ దర్శక నిర్మాతలు కూడా సినిమా మీద కన్నేశారట. ఇక తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్ క్రేజీ హీరో రణ్ వీర్ సింగ్ నటిస్తాడని టాక్. ఒకవేళ రణ్ వీర్ కనుక ఈ సినిమాలో నటిస్తే ఆ సినిమా రేంజ్ వేరేలా ఉంటుందని చెప్పొచ్చు.

మొత్తానికి అనుకున్న దాని కన్నా అదిరిపోయే హిట్ అందుకున్న అర్జున్ రెడ్డి సినిమా సంచలనం సృష్టించడమే కాకుండా ఇతర భాషల్లో కూడా తెలుగు సినిమా స్టామినాను ప్రూవ్ చేస్తుంది. తెలుగులో హిట్ అయిన ఈ సినిమా తమిళ, హింది భాషల్లో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.