సంబంధిత వార్తలు

‘కొచ్చడయాన్’, ‘లింగ’ వంటి వరుస అట్టర్ ఫ్లాపుల తర్వాత తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘కబాలి’ సినిమాపై అభిమానులు ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు. అభిమానుల అంచనాలను అందుకునే విధంగా ‘కబాలి’ దర్శకుడు రంజిత్ ఎంతో జాగ్రత్తగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ‘కబాలి’ టీజర్ ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసి, కొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. ఇదిలా వుంటే రోజురోజుకి ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోతున్నాయి. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ సినిమా రిలీజ్ హక్కులను కోసం పెద్ద ఎత్తున పోటీ పెరిగింది. చివరకు ‘కబాలి’ తెలుగు వర్షెన్ రిలీజ్ హక్కులను షణ్ముక పిక్చర్స్ సొంతం చేసుకుంది. అధిక మొత్తానికి ‘కబాలి’ హక్కులను సొంతం చేసుకున్నట్లుగా తెలిసింది. రజనీకాంత్ కు తెలుగులో వున్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు ‘కబాలి’ టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ ను దృష్టిలో వుంచుకొని, ఇంత మొత్తానికి కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ‘కబాలి’ గ్యాంగ్ స్టర్ గా రజనీకాంత్ కనిపించబోతున్నాడు. రజనీకాంత్ భార్య పాత్రలో బాలీవుడ్ హాట్ హీరోయిన్ రాధిక ఆప్టే నటిస్తుంది. కోలీవుడ్ యువ హీరోయిన్ ధన్సిక ఓ ముఖ్య పాత్రలో నటిస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా చివరి దశకు చేరుకున్నాయి. ఈ సినిమాను తెలుగు, తమిళం భాషలలో ప్రపంచ వ్యాప్తంగా జులై 1న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి.