
యాంకర్ అనసూయ ఈమధ్య వార్తల్లో బాగా నిలుస్తున్న సంగతి తెలిసిందే.. తనకు అవసరం లేని విషయాల మీద అమ్మడు జోక్యం చేసుకుని అనవసరమైన తిప్పలు పడాల్సి వస్తుంది. మొన్నామధ్య బన్నిని టార్గెట్ చేస్తే మెగా ఫ్యాన్స్ ఆమెను చీల్చి చెండాడారు. ఇక రీసెంట్ గా అర్జున్ రెడ్డి మీద ఆమడి కామెంట్స్ కు అదే రేంజ్ లో రివర్స్ కౌంటర్లు తెలిసినవే.
ఇక వీటన్నిటికి సమాధానం ఇవ్వాలనుకుందో ఏమో 'నింద నిజమైతే తప్పక దిద్దుకో.. అబద్ధమైతే నవ్వేసి ఊరుకో' అంటూ ట్వీట్ చేసింది. ఇది రంగస్థలం 1985లోని డైలాగ్ అంటూ తను ట్వీట్ చేయడం విశేషం. అంతేకాదు కాళ్లు మాత్రమే కనబడేలా పిక్ పెట్టి సర్ ప్రైజ్ చేసింది అనసూయ. ఇక అమ్మడు ఇలా ఆ పోస్ట్ పెట్టిందో లేదో ఆమెకే సెటైర్ వేస్తూ అందుకే అర్జున్ రెడ్డి గురించి నువ్వు ఎంత మాట్లాడినా విజయ్ సైలెంట్ గా ఉన్నాడంటూ హడావిడి చేస్తున్నారు. పాపం అనసూయ రాంగ టైంలో రాంగ్ మెసేజ్ పెట్టానని అనుకుంటుందేమో మరి.