పవన్ టైటిల్ పై ఆరోజు క్లారిటీ వస్తుందట..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న త్రివిక్రం సినిమా టైటిల్ విషయంలో ఇంకా కన్ ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది. రీసెంట్ గా పవర్ స్టార్ బర్త్ డే రోజున ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ కూడా ఎనౌన్స్ చేస్తారని భావించారు కాని అభిమానులకు నిరాశే కలిగింది. ఇక ఈ సినిమా టైటిల్ పై దసరా రోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉందట. దసరా రోజున ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ చేస్తారని తెలుస్తుంది.

ఇక రకరకాల టైటిల్స్ ప్రచారంలో ఉండగా ఫైనల్ గా అజ్ఞాతవాసి అన్న టైటిల్ మాత్రం పక్కా అంటున్నారు. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంలో కె. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇక పవన్ టైటిల్ ఎనౌన్స్ మెంట్ తో సంబరాలు దసరా సంబరాలను మరింత ఉత్సాహంగా జరుపుకోనున్నారన్నమాట.