రాయ్ లక్ష్మి రచ్చ మొదలైంది..!

లక్ష్మి రాయ్ లీడ్ రోల్ గా వస్తున్న సినిమా జూలీ-2. దీపక్ శివదాసాని డైరక్షన్ లో వస్తున్న ఈ జూలీ-2లో రాయ్ లక్ష్మి ఏమాత్రం దాచుకోకుండా అందాలను ప్రదర్శించిందని చెప్పొచ్చు. బికిని తోనే కాదు న్యూడ్ సీన్స్ తో కూడా రెచ్చిపోయిందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. ఇక సినిమాతో ఎలాగైనా బీ టౌన్ లో తన రేంజ్ పెంచుకోవాలని చూస్తున్న రాయ్ లక్ష్మి కోరిక ఫలిస్తుందనే అనిపిస్తుంది. 

అడల్ట్ కంటెంట్ సినిమాలకు బాలీవుడ్ లో మైలేజ్ ఎక్కువే ఉంటుంది. సినిమా కథ కథనాలు ఎలా ఉన్నా సరే సినిమాలో కావాల్సిన శృంగార సన్నివేశాలు ఉంటే చాలు ఆ బొమ్మ హిట్ అయినట్టే. జూలీ సీక్వల్ గా వస్తున్న జూలీ-2ను తెలుగు, తమిళంలో కూడా డబ్ చేసి రిలీజ్ చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు.