సైరాలో చాన్స్ కొట్టేసిందట..!

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా చేస్తున్న సైరా నరసింహారెడ్డి మూవీ అక్టోబర్ మొదటి వారం నుండి సెట్స్ మీదకు వెళ్లబోతుంది. ఈ సినిమాలో ఇప్పటికే నయనతార ఓ హీరోయిన్ కాగా మరో ఇద్దరికి అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక ఆ ఇద్ద్దరిలో ఒకరు అనుష్క మరొకరు ప్రగ్యా జైశ్వాల్ ఈ ఛాన్స్ దక్కించుకున్నారట.  

సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న సైరా నరసింహారెడ్డి మూవీని కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్లో రాం చరణ్ నిర్మిస్తున్నాడు. అనుష్క విషయంలో క్లారిటీ రాలేదు కాని ప్రగ్యా జైశ్వాల్ మాత్రం సైరాలో ఛాన్స్ పట్టేసినట్టే అని తెలుస్తుంది. కంచె సినిమాతో లైం లైట్ లోకి వచ్చిన ప్రగ్యా జైశ్వాల్ కమర్షియల్ గా హిట్ కొట్టలేదు కాని ఇప్పుడున్న తెలుగు హీరోయిన్స్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పరచుకుంది. మరి అమ్మడికి ఈ సైరా కెరియర్ లో ఓ మంచి సినిమాగా మిగిలిపోతుందేమో చూడాలి.