
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటించిన జై లవ కుశ సినిమా సెప్టెంబర్ 21న రిలీజ్ అవబోతుంది. బాబి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రాం నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆడియో నిన్న డైరెక్ట్ గా మార్కెట్ లోకి రిలీజ్ అవ్వగా నిన్న సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి చిత్రయూనిట్ సినిమా విషయాలను పంచుకున్నారు.
హరికృష్ణ చీఫ్ గెస్ట్ గా వచ్చిన ఈ ఆడియో వేడుకలో తారక్ స్పీచ్ ఎప్పటిలానే అదిరిపోయింది. నాన్నకు పుట్టినరోజు కానుకగా సినిమాను రిలీజ్ చేద్దామని అనుకున్నాం కాకపోతే 21కి రిలీజ్ చేయాల్సి వస్తుందని. ఇది అన్నదమ్ముల అనుబంధాన్ని తెలిపే సినిమా అని అన్నారు. ఇక ఈ సందర్భంగా పెద్ద అన్నయ్య జానకి రాం ను కూడా గుర్తుచేసుకున్నారు తారక్. జానకి రాం ఉండి ఉంటే ఈ సినిమా జై లవ కుశ టైటిల్ కు న్యాయం జరిగేదని అన్నారు. సినిమాకు పనిచేసిన టెక్నిషియన్స్ అందరి గురించి చెప్పిన తారక్ దేవి సాంగ్స్ స్పెషల్ గా మెచ్చుకున్నాడు. తన సినిమాలకు ఎలాంటి సాంగ్స్ కావాలో దేవికి తెలుసని.. అందుకే తనని ఎప్పుడైనా మరోటి అడిగినా మారు మాట మాట్లాడకుండా మరోటి ఇస్తాడని అన్నారు. సెప్టెంబర్ 10న జై లవ కుశ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండబోతుందని అన్నారు.