
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 102వ మూవీ కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నయనతార ఓ హీరోయిన్ కాగా మరో ఇద్దరు హీరోయిన్స్ ఉండే అవకాశం ఉందట. ఇక అందులో ఒకరిగా మలయాళ భామ నటాషా ధోషి సెలెక్ట్ అయ్యిందని టాక్. హైడ్ అండ్ సీక్, నయన సినిమాలతో మలయాళంలో క్రేజ్ సంపాదించిన నటాషా బాలయ్య సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతుంది.
యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా నందమూరి ఫ్యాన్స్ ను కచ్చితంగా ఆకట్టుకుంటుందని అంటున్నారు. ఈమధ్యనే మొదలైన ఈ సినిమా తప్పకుండా బాలయ్య హిట్ మేనియాను కంటిన్యూ చేసేలా ఉంటుందట. రీసెంట్ గా పైసా వసూల్ తో బాక్సాఫీస్ పై తన సత్తా చూపిస్తున్న బాలయ్య 102వ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.