ఇంద్రగంటి మోహనకృష్ణతో సుధీర్ బాబు..!

ఘట్టమనేని ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు కొత్త కథలతో సినిమాలు తీస్తున్నాడు. రీసెంట్ గా వచ్చిన శమంతకమణితో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుధీర్ బాబు ప్రస్తుతం గోపిచంద్ బయోపిక్ గా వస్తున్న సినిమాలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత సుధీర్ బాబు ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో మూవీ చేస్తాడని టాక్. 

ఓ రియలిస్టిక్ స్టోరీతో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే కథ విన్న సుధీర్ బాబు సింగిల్ సిట్టింగ్ లోనే ఓకే చేసి సినిమా చేసేద్దాం అన్నాడట. ఇటీవల వచ్చిన అమి తుమి సినిమాతో హిట్ అందుకున్న ఇంద్రగంటి మోహనకృష్ణ సుధీర్ బాబు తో సినిమా అనగానే అంచనాలు పెరిగాయి. మరి ఈ సినిమా ఎలాంటి జానర్ లో ఉండబోతుంది.. సినిమా మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది త్వరలో తెలుస్తుంది.