అనిరుధ్ అదరగొట్టాడబ్బా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రం కాంబినేషన్ లో జల్సా, అత్తారింటికి దారేది సినిమాల తర్వాత రాబోతున్న సినిమా సెట్స్ మీద ఉంది. దాదాపు సినిమా పూరి కావొచ్చిన ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ నిన్న సాయంత్రం రిలీజ్ చేశారు. ఇక ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే కానుకగా అనిరుధ్ కంపోజ్ చేసిన సాంగ్ బిట్ రిలీజ్ చేశారు.

బయటకొచ్చి చూస్తే 3 ఓ క్లాక్.. అనే బిగ్ సాంగ్ తో మొదటి డైరెక్ట్ తెలుగు పాటతో వచ్చాడు. అనిరుధ్ మ్యూజిక్ అదరగొట్టాడని చెప్పొచ్చు. ఇక ఈ సాంగ్ కంపోజింగ్ లో త్రివిక్రం కూడా అనిరుధ్ తో పాటే కనిపించాడు. కోలీవుడ్ లో క్రేజీ మ్యూజిక్ డైరక్టర్ అయిన అనిరుధ్ రవిచంద్రన్ ఇప్పుడు తెలుగు సినిమాల్లో కూడా తన సత్తా చాటాలని చూస్తున్నాడు. అనిరుధ్ ఎంట్రీ అదిరింది మరి అసలు సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.