
విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి డైరక్షన్ లో వచ్చిన సినిమా అర్జున్ రెడ్డి. యూత్ ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేస్తూ ఈ సినిమా సృష్టిస్తున్న సంచలనాలు అన్ని ఇన్ని కావు. రిలీజ్ ముందు అంచనాల కన్నా రిలీజ్ తర్వాత సినిమా ప్రభావం ఏంటన్నది కలక్షన్స్ రూపంలో తెలుస్తూనే ఉంది. ఇక ఈ సినిమా తెలుగులో హిట్ అవ్వగా దీన్ని తమిళంలో రీమేక్ చేయాలని ప్రయత్నాలు మొదలు పెట్టారట.
కోలీవుడ్ క్రేజీ హీరో ధనుష్ ఈ సినిమాను కోలీవుడ్ లో రీమేక్ చేస్తారని తెలుస్తుంది. అర్జున్ రెడ్డి సినిమా చూసిన ధనుష్ ఈ సినిమా రీమేక్ రైట్స్ కొనేశాడట. తన నిర్మాణ సంస్థ అయిన వండర్ బార్ ఫిలింస్ పతాకంలో ఈ సినిమా తెరకెక్కించబోతున్నారట. తెలుగులో హిట్ అవడమే కాదు తమిళంలో కూడా ఈ సినిమా క్రేజీ ప్రాజెక్ట్ అవ్వబోతుందన్నమాట. మరి విజయ్ దుమ్ము దులిపేసిన ఈ అర్జున్ రెడ్డి తమిళ తంబీలను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.