
తమిళ స్టార్ హీరో విశాల్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వున్నాడు. కేవలం నటుడిగానే కాకుండా ఇటీవలే నడిగర్ సంఘం ఎన్నికల్లో గెలిచి, తనవంతుగా ప్రజలకు సహయం చేస్తున్నాడు. అందరితో శభాష్ అనిపించుకుంటున్నాడు. అలాంటి విశాల్ కు తాజాగా మరో పురస్కారం వరించింది.
భారతదేశంలో పశువుల సంరక్షణ కోసం స్థాపించిన కాటిల్ ఇన్ ఇండియా(పిఎఫ్ సీఐ) సంస్థ ప్రతి ఏడాది జంతుసంరక్షణ కోసం కృషిచేసిన కొంతమందికి పురస్కారాలను అందజేస్తుంది. తాజాగా ఈ సంస్థ విశాల్ కు పీఎఫ్‌సీఐ పురస్కారాన్ని తమిళనాడు గవర్నర్ రోశయ్య అందజేసారు. విశాల్ తో పాటు ఈ ఏడాది పీఎఫ్‌సీఐ పురస్కారాలు అందుకున్న వారిలో తమిళ హీరోయిన్ వరలక్ష్మీ కూడా వుంది. తమిళ యువ ప్రేమికులుగా పేరొందిన ఈ జంటకు పురస్కారాలు రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఇటీవలే విశాల్ నటించిన ‘రాయుడు’ సినిమా తెలుగు, తమిళం భాషలలో మంచి విజయం సాధించి, కలెక్షన్ల మోత మోగిస్తోంది. ముత్తయ్య దర్శకత్వంలో రూపొందిన పక్కా మాస్ మసాలా ఎంటర్ టైనర్ ‘రాయుడు’లో శ్రీదివ్య హీరోయిన్ గా నటించింది. ‘రాయుడు’ తర్వాత ప్రస్తుతం తమన్నాతో కలిసి విశాల్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఇందులో జగపతి బాబు నెగెటివ్ పాత్రలో కనిపించనున్నాడు.