పవన్ కళ్యాణ్ పోస్టల్ స్టాంప్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన స్టైలిష్ యాక్షన్ తో ఆకట్టుకోవడమే కాదు అదే క్రేజ్ తో జనసేన అంటూ పార్టీ పెట్టి రాజకీయాల్లో కూడా బలమైన ముద్ర వేయాలని చూస్తున్నాడు పవన్ కళ్యాన్. ఇక ఈ క్రమంలో భాగంగా పవన్ పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేశారు. జనసేన ప్రతినిధి వెంకట మహేష్, పోస్టల్ అధికారి వరదయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

విజయవాడలో రిలీజ్ చేసిన ఈ పోస్టల్ స్టాంప్ లో జనసేన అధినేత పవన్ ఫోటో ఉంది. ఇలా తమకు నచ్చిన వారి మీద పోస్టల్ స్టాంప్ ఏర్పాటు చేసుకోవడం పెద్ద కష్టమేమి కాదు. ఇక రేపు అనగా సెప్టెంబర్ 2న పవర్ స్టార్ బర్త్ డే కానుకగా ఈ పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేశారు. జనసేన ప్రతినిధిగా 2019 ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తున్న పవన్ ఎలాంటి రాజకీయ ప్రక్షాళన ఏర్పరుస్తారో అని ఆయన అభిమానులు కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు.