నానితో కాజల్, నిత్యా

నాచురల్ స్టార్ నాని ఇప్పుడు స్టార్ లీగ్ లోకి వచ్చేశాడు. ఆయన తీస్తున్న వరుస హిట్ సినిమాలను చూసి హీరోయిన్సే తమంతట తాము నానితో నటించేందుకు రెడీ అని ఎనౌన్స్ చేస్తున్నారు. రీసెంట్ గా నిన్ను కోరితో హిట్ అందుకున్న నాని ప్రస్తుతం ఎం.సి.ఏ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 22న రిలీజ్ అవుతుందని తెలుస్తుంది.

ఇక ఈ సినిమా తర్వాత మేర్లపాక గాంధి డైరక్షన్ లో కృష్ణార్జున యుద్ధం చేస్తున్న నాని తను నిర్మాతగా మారి ఓ సినిమా చేస్తున్నాడట. ప్రశాంత్ వర్మ చెప్పిన కథకు త్రిల్ అయిన నాని ఈ సినిమాను తన నిర్మాణంలో తీయాలని ఫిక్స్ అయ్యాడట. సినిమాలో హీరోయిన్స్ గా కాజల్, నిత్యాలను సెలెక్ట్ చేశారట. మరి ఇద్దరు క్రేజీ హీరోయిన్స్ తన సినిమా కోసం సెలెక్ట్ చేసిన నాని అందులో తను హీరోగా నటిస్తాడా లేక మరెవరినైనా తీసుకుంటాడా అన్నది తెలియాల్సి ఉంది.