
సౌత్ డైరక్టర్ అయినా సరే మురుగదాస్ అంటే నేషనల్ వైడ్ ఫాలోయింగ్ ఉంటుంది. ఆయన తీసిన సౌత్ సినిమాలనే మళ్లీ హిందిలో రీమేక్ చేస్తుంటాడు. అసలు మురుగదాస్ ఎందుకు తెలుగు తమిళంలో తీసి హిట్ అందుకున్న సినిమాలు హిందిలో రీమేక్ చేస్తాడు అంటే.. రెండు చోట్ల ఒకే రకమైన క్రేజ్ ఉన్న హీరోలు లేకనే అని తెలుస్తుంది.
సౌత్ లో ముఖ్యంగా తెలుగు తమిళంలో ఏ హీరో చేసినా కథ కథనాలు బాగుంటే యాక్సెప్ట్ చేస్తారు. అయితే బాలీవుడ్ లో అలా కాదు. అందుకే తుపాకి, రమణ, గజిని సినిమాలు అక్కడ వేరే హీరోలతో రీమేక్ చేశాడట. ఇక ఈ రీమేక్ కథకు ఫుల్ స్టాప్ పెట్టేసి ఇక నుండి అక్కడ ఇక్కడ మార్కెట్ ఉన్న హీరోలతోనే సినిమాలు తీయాలని చూస్తున్నాడట మురుగదాస్. అందుకు ప్రయత్నంగా మహేష్ తో స్పైడర్ తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతున్నా హిందిలో కూడా రిలీజ్ చేస్తున్నారు.
ఇక ఇప్పుడు మురుగదాస్ కన్ను బాహుబలితో నేషనల్ వైడ్ గా ఫుల్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మీద పడింది. ప్రభాస్ తో సినిమా చేస్తే అటు హిందిలో కూడా భారీగా రిలీజ్ చేయొచ్చని అనుకుంటున్నాడట. స్పైడర్ తర్వాత విజయ్ తో సినిమా కమిట్ అయిన ముర్గదాస్ కుదిరితే ప్రభాస్ కు సైతూగే కథ సిద్ధం చేసి అతన్ని కలవాలని అనుకుంటున్నాడు. మరి మురుగదాస్ తో ప్రభాస్ సినిమా అంటే రెబల్ స్టార్ ఫ్యాన్స్ కు పండుగ అన్నట్టే.