
పూరితో తీసిన పైసా వసూల్ సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాటిస్పేట్ చేసిన నందమూరి బాలకృష్ణ తన తర్వాత సినిమాల విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఇక మాటల సందర్భంలో ఎన్.టి.ఆర్ బయోపిక్ గా తాను చేస్తున్న సినిమా గురించి కూడా క్లారిటీ ఇచ్చారు బాలయ్య. అనుకున్న విధంగానే ఎన్.టి.ఆర్ బయోపిక్ చేసి తీరురాం అంటున్న బాలయ్య ఆ సినిమా దర్శకుడు ఎవరన్నది మరికొద్దిరోజుల్లో ఎనౌన్స్ చేస్తామని అన్నారు.
ఇక బాలయ్య మాటలని బట్టి చూస్తే పైసా వసూల్ అనుకున్న టార్గెట్ రీచ్ అయితే ఎన్.టి.ఆర్ బయోపిక్ ఛాన్స్ పూరికే ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే బాలయ్య ఎన్.టి.ఆర్ బయోపిక్ ఎనౌన్స్ చేయగానే వర్మ ఆ సినిమాను తానే డైరెక్ట్ చేయబోతున్నట్టు ప్రకటించాడు. బాలయ్య మాత్రం ఆర్జివి విషయం స్పందించలేదు కాని ఎన్.టి.ఆర్ బయోపిక్ పై చర్చలు నడుస్తున్నాయని ఆయన పరిపూర్ణ జీవితాన్ని సినిమాలో చూస్తారని. తెలియని ఎన్నో విషయాలు సినిమాలో ప్రస్తావించడం జరుగుతుందని అన్నారు. సో ఎన్టీఆర్ బయోపిక్ అటకెక్కినట్టే అంటూ మీడియా చేసిన హడావిడికి బాలయ్య మార్క్ వేసిన పంచ్ ఇదే అన్నమాట.