
క్రేజీ డైరక్టర్ పూరి జగన్నాధ్ ఇండస్ట్రీ హిట్లను సైతం ఇచ్చి తన సత్తా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. దర్శకుడిగా పూరి రేంజ్ ఏంటో ఆయన సినిమాల ఫలితాలు చూస్తే తెలుస్తుంది. అయితే ఈమధ్య పూరి కాస్త వెనుకపడ్డాడని తెలిసిందే. హిట్ కోసం పూరి తపన అంతా ఇంతా కాదు. బాలయ్యతో రేపు పైసా వసూల్ గా రాబోతున్న పూరి సినిమాతో తన ఫేట్ మార్చుకుంటాడని అంటున్నారు.
ఇక పూరి తనయుడు ఆకాశ్ హీరోగా ఇప్పటికే ఆంధ్రాపోరి సినిమా తీశాడు. అంతేకాదు చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తూనే వస్తున్నాడు. ఆకాష్ ను పూరి మార్క్ హీరోగా నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడట. అందుకే కొడుకుని హీరోగా పెట్టి సినిమా తీయాలని డిసైడ్ అయ్యాడట. తనయుడిని హీరోగా ప్రమోట్ చేస్తూ పూరి ఇప్పటికే ఓ అద్భుతమైన కథ సిద్ధం చేశాడట. త్వరలోనే ఆ సినిమా ఎనౌన్స్ మెంట్ వస్తుందని తెలుస్తుంది. మరి డైరెక్టర్ గా పూరి తన కొడుకుని ఎలాంటి రేంజ్ లో నిలబెడతాడు అన్నది చూడాలి.