
మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా స్పైడర్. సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఆడియో సెప్టెంబర్ 9న రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అయితే తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆడియో తమిళంలోనే రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. సెప్టెంబర్ 9న చెన్నైలో గ్రాండ్ ఈవెంట్ ఏర్పాటుచేసి సినిమా ఆడియోని అక్కడే రిలీజ్ చేయనున్నారట.
ఇక తెలుగులో మాత్రం ఆడియోని మార్కెట్ లోకి డైరెక్ట్ గా రిలీజ్ చేస్తారట. ఇక్కడ మాత్రం సెప్టెంబర్ 16, 17 తారీఖులలో ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తారట. పక్కా ప్లాన్ ప్రకారమే అక్కడ ఆడియో ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్ చేశారు. స్పైడర్ తో సంచలనాలకు సిద్ధమైన మహేష్ దసరా బరిలో దుమ్ముదులిపేందుకు వస్తున్నాడు. రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్ సినిమాలు సినిమా మీద అంచనాలను పెంచేసింది.