
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ బాబి డైరక్షన్ లో వస్తున్న సినిమా జై లవ కుశ. తారక్ ట్రిపుల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా, నివేథా థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సెప్టెంబర్ 21న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఆడియో సెప్టెంబర్ 3న రిలీజ్ చేయాలని చూశారు. ఫ్యాన్స్ తో భారీ రేంజ్ లోనే ఆడియో రిలీజ్ చేయాలని చూడగా చివరి నిమిషంలో ఈ ఆడియోని క్యాన్సిల్ చేస్తూ నిర్మాత నందమూరి కళ్యాణ్ రాం నిర్ణయం తీసుకున్నారట.
ఆరోజు గణేష్ నిమజ్జనం ఉండటం వల్ల ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుందన్న ముందుచూపుతో అభిమానులను ఇబ్బంది పెట్టకుండా జై లవ కుశ ఆడియోని డైరెక్ట్ గా మార్కెట్ లోకి రిలీజ్ చేస్తారని అన్నారు. ఇక సెప్టెంబర్ 10న ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేస్తారట. ఈ వేడుకలోనే సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తారని అంటున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన జై లవ కుశ సాంగ్స్ సెప్టెంబర్ 3నుండి డైరెక్ట్ గా మార్కెట్ లోకి వచ్చేస్తాయన్నమాట.