వెంకీతో విజయ్ మల్టీస్టారర్ మూవీ..!

టాలీవుడ్ లో మల్టీస్టారర్ మూవీస్ కు ఊతమిచ్చిన హీరో అంటే అది కచ్చితంగా విక్టరీ వెంకటేష్ అనే చెప్పాలి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ఎంతోమంది స్టార్స్ కు మల్టీస్టారర్ సినిమా చేసేలా నమ్మకాన్ని ఇచ్చింది. ఇక కొద్దికాలం గ్యాప్ తో బాబు బంగారం అంటూ తన మార్క్ స్టైల్ యాక్షన్ ఎంటర్టైనర్ తో.. ఆ తర్వాత గురు సినిమాలతో వచ్చిన వెంకటేష్ ఇప్పుడు మళ్లీ ఓ మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడట. 


ఇంతకీ వెంకటేష్ మల్టీస్టారర్ చేసేది ఎవరితో అంటే పెళ్లిచూపులు సినిమాతో సూపర్ హిట్ అందుకుంది రీసెంట్ గా వచ్చిన అర్జున్ రెడ్డితో కూడా కలక్షన్స్ కుమ్మేస్తున్న విజయ్ దేవరకొండతో అని తెలుస్తుంది. భాస్కర్ డైరెక్ట్ చేయబోతున్న ఈ సినిమా గురించి త్వరలో ఎనౌన్స్ మెంట్ రానుందట. అర్జున్ రెడ్డి రిలీజ్ కు ముందే ఈ సినిమా కమిట్మెంట్ ఇచ్చాడట విజయ్ దేవరకొండ. మరి వెంకటేష్ తో విజయ్ సినిమా అంటే కచ్చితంగా సినిమా అంచనాలు ఏర్పడ్డట్టే. ఆ అంచనాలను సినిమా రీచ్ అవుతుందో లేదో చూడాలి.