
డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ కూతురు పవిత్ర ఇప్పుడు డైరక్టర్ గా మారబోతుంది. త్వరలో ఆమె డైరక్షన్ చేయబోతున్నట్టు సమాచారం. ఆల్రెడీ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన పవిత్ర తన తండ్రి సినిమాలకు అసిస్టెంట్ డైరక్టర్ గా కూడా పనిచేసింది. పూరి తనయుడు ఆకాష్ హీరోగా చేస్తూ హీరో చైల్డ్ రోల్ చేస్తూ వస్తున్నాడు.
ఇక పూరి వారసత్వాన్ని తీసుకుని పవిత్ర డైరక్షన్ చేస్తా అంటుంది. ఈమధ్యనే డ్రగ్స్ కేసులో పూరికి సపోర్ట్ గా తన వాయిస్ వినిపించింది పవిత్ర. బుజ్జిగాడు సినిమాలో నటించిన ఈ చిన్నది ఇప్పుడు సినిమాను డైరెక్ట్ చేసే రేంజ్ కు వెళ్లడం మంచి విషయమని చెప్పొచ్చు. పూరి నిర్మాతగా పవిత్ర డైరక్షన్ లో సినిమా త్వరలో ఎనౌన్స్ మెంట్ చేస్తారట. మరి పూరి ఫ్యామిలీ నుండి వస్తున్న ఈ దర్శకురాలు ఎలాంటి సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తారో చూడాలి. ప్రస్తుతం ఫ్లాపుల్లో ఉన్న పూరి బాలయ్య హీరోగా పైసా వసూల్ సినిమా చేశాడు. సెప్టెంబర్ 1న రాబోతున్న ఈ సినిమా పూరి ఫేట్ మారుస్తుందేమో చూడాలి.