
మారుతి డైరక్షన్ లో శర్వానంద్ హీరోగా వస్తున్న సినిమా మహానుభావుడు. యువి క్రియేషన్స్ బ్యానర్లో కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా టీజర్ ఈమధ్యనే రిలీజ్ అయ్యి మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇక సినిమా మీద అంచనాలను పెంచేసిన ఈ టీజర్ ఓవర్సీస్ లో భారీ రేటుకి అమ్ముడయ్యేలా చేసింది. ఈ సినిమాను ఓవర్సీస్ లో 3.3 కోట్లకు కొనేశారట.
భలే భలే మగాడివోయ్ సినిమాతో ఓవర్సీస్ లో భారీ కలక్షన్స్ సాధించిన మారుతి ఈ సినిమా కూడా అక్కడి అభిమానుల అభిరుచికి తగ్గట్టు తెరకెక్కిస్తున్నారట. మెహెరిన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా దసరా బరిలో రిలీజ్ అవుతుంది. భారీ బడ్జెట్ సినిమాలను నమ్ముకునే కంటే చిన్న సినిమాలతో ఓవర్సీస్ లో భారీ విజయాలను అందుకుంటున్నారు. రీసెంట్ గా వచ్చిన ఆనందో బ్రహ్మ, అర్జున్ రెడ్డి సినిమాలు అక్కడ భారీ వసూళ్లను రాబట్టాయి. అందుకే మహానుభావుడు సినిమాకు ఈ రేంజ్ బిజినెస్ జరిగింది.