బాహుబలిని బీట్ చేసిన వివేగం..!

ఇండియన్ సినిమా చరిత్రలోనే ఓ సంచలనం సృష్టించిన బాహుబలి సినిమా రికార్డులను ఏ సినిమా ఇప్పుడప్పుడే క్రాస్ చేయడం కష్టమని భావించారు. కాని రీసెంట్ గా రిలీజ్ అయిన అజిత్ వివేగం బాహుబలి ఓ రికార్డును బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది. లాస్ట్ గురువారం రిలీజ్ అయిన వివేగం సినిమా శివ డైరక్షన్ లో వచ్చింది. కాజల్ అవర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా తెలుగులో వివేకం టైటిల్ తో రిలీజ్ అయ్యింది.

సినిమా తెలుగులో ఫ్లాప్ అయ్యింది.. తమిళంలో కూడా సినిమాకు నెగటివ్ రివ్యూస్ వచ్చాయి. అయితే ఈ సినిమా చెన్నైలో మాత్రం సంచలన రికార్డ్ సృష్టించింది. సినిమా రిలీజ్ అయిన నాలుగు రోజుల్లో బాహుబలి కలక్షన్స్ కన్నా ఈ సినిమా రికార్డ్ కలక్షన్స్ సాధించింది. రిలీజ్ అయిన నాలుగు రోజుల్లో బాహుబలి 3.24 కోట్లు కలెక్ట్ చేయగా.. విజయ్ భైరవ 3.09 కోట్లు సాధించింది. ఇక ఈ రెండు రికార్డులను క్రాస్ చేస్తూ అజిత్ వివేగం 5.20 కోట్లు సాధించింది. ఈ సినిమా ఫుల్ రన్ లో ఫ్లాప్ నిరాశ మిగిల్చినా చెన్నైలో మాత్రం అదరిపోయే కలక్షన్స్ సాధించింది.