అటు బాలయ్య.. ఇటు పూరి..!

సినిమా రిలీజ్ అంటే ప్రమోషన్స్ పీక్స్ లో చేయాలన్న విషయం సినిమా వాళ్లు బాగా ఎక్కించుకున్నారు. అందుకు సాధనాలుగా బుల్లితెర మీదకు వచ్చి తమ సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్నారు. లేటెస్ట్ గా స్టార్స్ కూడా వచ్చి చేస్తున్న రియాలిటీ షోలు ఒకటి బిగ్ బాస్, మరొకటి నెంబర్ 1 యారి. ఎన్.టి.ఆర్ బిగ్ బాస్ అదరగొడుతుండగా.. దగ్గుబాటి రానా హోస్ట్ గా నెంబర్ 1 యారి కూడా ప్రేక్షకులను అలరిస్తుంది.

అయితే సెప్టెంబర్ 1న రిలీజ్ అవబోతున్న బాలయ్య పైసా వసూల్ మూవీ ఇప్పుడు ప్రమోషన్స్ తో ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేస్తుంది. అందుకే బిగ్ బాస్ షోలో పూరి, నెంబర్ 1 యారి షోకి బాలయ్య వస్తున్నట్టు టాక్. బాలయ్య పూరి కాంబినేషన్ లో క్రేజీ మూవీగా రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. మరి ఈ బుల్లితెర ప్రమోషన్స్ సినిమాకు ఏమాత్రం హెల్ప్ అవుతాయో చూడాలి.