
కింగ్ నాగార్జున నటించాలనుకున్న ఓ మల్టీస్టారర్ మూవీలో విజయ్ దేవరకొండ ఛాన్స్ కొట్టేసినట్టు లేటెస్ట్ టాక్. నూతన దర్శకుడు చెప్పిన కథకు ఫిదా నిర్మాతలు నాగార్జున, నానిలతో ఆ సినిమా చేయాలని అనుకున్నారు. కాని నాగార్జున కాకుండా ఆ పాత్రలో విజయ్ దేవరకొండను ఫైనల్ చేస్తున్నారట. ఈమధ్యనే అర్జున్ రెడ్డితో సత్తా చాటిన విజయ్ దేవరకొండ వరుస అవకాశాలను అందుకుంటున్నాడు.
ఇక నాని విజయ్ కలిసి ఇప్పటికే ఎవడే సుబ్రమణ్యం సినిమాలో నటించారు. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ లో మూవీ రాబోతుంది. ఓ పక్క నాని కూడా వరుస విజయాలతో దూసుకుపోతుంటే విజయ్ దేవరకొండ కూడా ఊహించని రీతిలో తన కెరియర్ ను ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నాడు. మరి ఈ ఇద్దరు కలిసి చేసే మల్టీస్టారర్ రేంజ్ ఏవిధంగా ఉంటుందో చూడాలి.