
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో జై లవ కుశ సినిమా చేస్తున్న బాబి ఆ సినిమా పూర్తి చేసే పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమా పూర్తి కాగానే తన తర్వాత సినిమాతో బన్నితో చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడట బాబి. బన్ని కూడా బాబితో చేసేందుకు సుముఖంగా ఉన్నాడట. ఇద్దరు కలిసి త్వరలో కథా చర్చల్లో పాల్గొంటారని తెలుస్తుంది.
ప్రస్తుతం అల్లు అర్జున్ వక్కంతం వంశీ డైరక్షన్ లో నా పేరు సూర్య సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే తర్వాత బాబితోనే సినిమా చేస్తాడని టాక్. అసలైతే బన్నితో కోలీవుడ్ డైరక్టర్ లింగుసామి సినిమా ఉంటుందని అనుకున్నా బాబి సినిమా ముందుకొస్తే అది ఇంకా లేట్ అయ్యే అవకాశాలున్నాయట. అయితే జై లవ కుశ అనుకున్న అంచనాలను రీచ్ అయితే సినిమా కన్ గా ఉంటుందట. ఒకవేళ ఆ సినిమా ఫలితం నిరాశ పరచితే మాత్రం మళ్లీ బన్ని డెశిషన్ మారుస్తాడని అంటున్నారు.