
ఇటీవల రిలీజ్ అయ్యి సూపర్ కలక్షన్స్ తో దూసుకుపోతున్న అర్జున్ రెడ్డి సినిమాపై సెలబ్రిటీల అభినందనలు వెళ్లువెత్తుతున్నాయి. ఇప్పటికే సినిమా చూసిన రాజమౌళి చిత్రయూనిట్ అంతటికి కంగ్రాట్స్ చెప్పగా.. ఇక ఇప్పుడు తెలంగాణా రాష్ట్ర మంత్రి కె. తారక రామారావు కూడా అర్జున్ రెడ్డి సినిమాపై ప్రశంసలు కురిపించారు.
అర్జున్ రెడ్డి సినిమా చూసిన కె.టి.ఆర్ విజయ్ దేవరకొండ నువ్వు రాక్ స్టార్.. నిజాయితి కలిగిన బోల్డ్ మూవీ అంటూ కామెంట్ పెట్టారు. చిత్రయూనిట్ కె.టి.ఆర్ ప్రశంసలకు ఉప్పొంగింపోతున్నారు. విజయ్ దేవరకొండ అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో వచ్చిన ఈ సినిమాను సందీప్ రెడ్డి డైరెక్ట్ చేశారు. కె.టి.ఆర్ ట్వీట్ తో సినిమా మీద మరింత క్రేజ్ పెరిగింది. ఇక రిలీజ్ అయిన ఈ సినిమా వారాంతరంలోనే 11 కోట్ల కలక్షన్స్ తో అదిరిపోయే వసూళ్లను సాధించింది.