నిర్మాతగా నాని.. అతను ఇంప్రెస్ చేశాడు..!

నాచురల్ స్టార్ నాని నిర్మాతగా మారబోతున్నాడన్నది టాలీవుడ్ లేటెస్ట్ న్యూస్. ప్రశాంత్ అనే కుర్రాడు చెప్పిన కథకు ఇంప్రెస్ అయిన నాని తన స్వీయ నిర్మాణంలో సినిమా చేయబోతున్నాడట. డైలాగ్ ఇన్ ద డార్క్ అంటూ వర్చువల్ ఆడియో టెక్నాలజీతో షార్ట్ ఫిల్మ్ తీసి తన టాలెంట్ చూపిన ప్రశాంత్ ఇప్పుడు నానికి ఓ అదిరిపోయే కథ నేరేట్ చేశాడట. 

కథ నచ్చడంతో నాని సినిమా చేసేద్దాం అన్నాడట. అయితే స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేయాల్సి ఉండగా కాస్త టైం తీసుకుని అవి చేసి కనబడమని చెప్పాడట. సో త్వరలోనే నాని నిర్మాతగా మరో సినిమా స్టార్ట్ అవనుంది. ఇదవరకు నాని డీ ఫర్ దోపిడి సినిమాకు డబ్బులు పెట్టాడు. అయితే ఆ సినిమా అంతగా కామర్షియల్ గా వర్క్ అవుట్ కాలేదు. మరి ఈసారైనా నాని ప్రయత్నం సక్సెస్ అవుతుందో లేదో చూడాలి. అయితే నిర్మాతగా మారిన ఆ సినిమాలో నాని నటిస్తాడా లేక మరెవరైనా హీరోగా తీసుకుంటాడా అన్నది కూడా తెలియాల్సి ఉండి.