మోషన్ పోస్టర్ తో అంచనాలు పెంచారు..!

రాజు గారి గది సీక్వల్ గా త్వరలో రాబోతున్న సినిమా రాజు గారి గది-2. ఓంకార్ డైరక్షన్ లో వస్తున్న ఈ సెకండ్ పార్ట్ కూడా భారీ అంచనాలే ఏర్పరచాయి. ముఖ్యంగా ఈ సినిమాలో నాగార్జున, సమంత లాంటి బిగ్ స్టార్స్ భాగమవడంతో సినిమాకు ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది. ఇక ఈ సినిమా మోషన్ పోస్టర్ ఈరోజు నాగార్జున బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు.

పివిపి నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాకు ఎస్.ఎస్. థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. మోషన్ పోస్టర్ లో థమన్ పనితనం మరోసారి చూపించాడు. రుద్రాక్షలతో నాగార్జున స్టిల్ ఫ్యాన్స్ కు భలే త్రిల్ ఇచ్చింది. అంతేకాదు సినిమా మీద అంచనాలను పెంచేలా మోషన్ పోస్టర్ కూడా ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేసింది. సెప్టెంబర్ 20న ట్రైలర్ రిలీజ్ అవుతున్న ఈ సినిమా అక్టోబర్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.