
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ స్టార్ మాలో చేస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్. సీజన్ వన్ లో సూపర్ సక్సెస్ చేయడంలో ఎన్.టి.ఆర్ కృషి అందరికి తెలిసిందే. ఇక ఈ షో గురించి ఆల్రెడీ మీలో ఎవరు కోటిశ్వరుడు చేసిన కింగ్ నాగార్జున ప్రశంసలు అందించారు. బుల్లితెర షోలు ఇంకా హీరోలను ప్రేక్షకుల దగ్గరకు చేరుస్తాయని అన్నారు.
ఇక ఎన్.టి.ఆర్ చేస్తున్న బిగ్ బాస్ చాలా బాగుందని. ఆ షోలో ఎన్.టి.ఆర్ రియల్ లైఫ్ లో ఎలా ఉంటాడో అలానే యాంకరింగ్ చేస్తున్నాడని అన్నారు. మొత్తానికి బిగ్ బాస్ ఎన్.టి.ఆర్ హోస్టింగ్ గురించి నాగార్జున అలా తన కామెంట్ వెళ్లడించాడు. అందుకే కాబోలు ఎన్.టి.ఆర్ ను బిగ్ బాస్ సీజన్-2 కోసం కూడా ఓకే చేశారు. బుల్లితెర ఆడియెన్స్ ను టివి ప్రోగ్రాం ద్వారా అలరించడంలో సక్సెస్ అయ్యాడు ఎన్.టి.ఆర్.