
అక్కినేని అఖిల్ నటిస్తున్న సెకండ్ మూవీ హలో. విక్రం కుమార్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా టైటిల్ విషయంలో చాలా కన్ ఫ్యూజ్ చేశారు. ఫైనల్ గా హలో అంటూ సింపుల్ టైటిల్ తో వస్తున్నారు. అయితే అఖిల్ సినిమా ఈ టైటిల్ వెనుక నాగార్జున ఉన్నట్టు తెలుస్తుంది. సినిమా కోసం రకరకాల టైటిల్స్ పరిశీలించినా ఫైనల్ గా సింపుల్ గా హలో అని నాగార్జుననే పెట్టారట.
హీరో హీరోయిన్ చేత హలో అని పిలిపించుకోవాలని చూస్తాడట. అదే టైటిల్ తో సినిమాకు ఫిక్స్ చేశారట. ప్రేక్షకులకు కూడా ఈ టైటిల్ క్యాచీగా ఉంటుందని ఈ టైటిల్ పెట్టేశారట. సో మొత్తానికి హలో టైటిల్ వెనుక నాగార్జున ప్రమేయం ఉందని తెలుస్తుంది. మరి ఈ సినిమా అఖిల్ కు ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.