గోపిచంద్ ఆక్సిజన్ రిలీజ్ ఫిక్స్..!

మాన్లీ స్టార్ గోపిచంద్ హీరోగా రీసెంట్ గా వచ్చిన గౌతం నంద పర్వాలేదు అనిపించినా కమర్షియల్ గా మాత్రం వర్క్ అవుట్ కాలేదు. ఇక ఎన్నాళ్ల నుండో రిలీజ్ కష్టాలు పడుతున్న ఆక్సిజన్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆక్సిజన్ సినిమా అక్టోబర్ 12న రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. దీపావళి కానుకగా ఈ సినిమా రాబోతుందట.

ఏ.ఎం రత్నం నిర్మాతగా జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా గోపిచంద్ కెరియర్ లో క్రేజీ మూవీగా రాబోతుంది. ఎన్నాళ్ల నుండో రిలీజ్ కష్టాలు పడుతున్న ఈ సినిమా ఎలంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.