మహేష్ శివ 100 కోట్ల పైమాటే..!

మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న స్పైడర్ బడ్జెట్ 120 కోట్ల పైనే అని తెలిసిందే. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతుండగా ప్రస్తుతం చేస్తున్న కొరటాల శివ భరత్ అను నేను బడ్జెట్ కూడా భారీ అంచనాలను ఏర్పరుస్తుంది. ఈ సినిమా బడ్జెట్ 100 కోట్ల పైమాటే అంటున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ భారీగా ఉంటుందట.

బాలీవుడ్ భామ కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శరత్ కుమార్ నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా సినిమాలో మహేష్ సిఎంగా కనిపిస్తారని టాక్. కమర్షియల్ సినిమాలకు సోషల్ మెసేజ్ అందిస్తూ కొరటాల శివ తీస్తున్న ఈ సినిమా మహేష్ కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలుస్తుందని అంటున్నారు.

స్పైడర్ తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతుంది కాబట్టి ఓకే.. కాని భరత్ అను నేను కేవలం తెలుగులో మాత్రమే వస్తుంది మరి ఈ సినిమా బడ్జెట్ మాత్రం భారీగా ఉంది. సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.