
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న సినిమా టైటిల్ ఎనౌన్స్ మెంట్ పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజున వస్తుందని నిన్న మొన్నటిదాకా వచ్చిన న్యూస్. సెప్టెంబర్ 2న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అని అన్నారు. కాని తెలుస్తున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ తన బర్త్ డే రోజున ఈ సినిమా ఫస్ట్ లుక్ రావడం కష్టమే అంటున్నారు.
సినిమా దాదాపు పూర్తి కావొస్తున్న సినిమా టైటిల్ రివీల్ చేయకపోవడం పై ఫ్యాన్స్ కాస్త అసహనంలో ఉన్నారు. పవన్ బర్త్ డే రోజు ఫస్ట్ లుక్ వస్తుందన్న అభిమానుల ఆశ నిరాశగా మిగిలేలా ఉంది. ఈమధ్య ఫస్ట్ లుక్ పోస్టర్ పై అఫిషియల్ స్టేట్మెంట్ ఇచ్చినా మళ్లీ ఎందుకో మనసు మార్చుకున్నారని తెలుస్తుంది. ఇక తెలుస్తున్న సమాచారం ప్రకారం త్రివిక్రం, పవన్ కళ్యాణ్ ల సినిమా రాజు వచ్చినాడో అని టైటిల్ పెడుతున్నారట. అయితే అఫిషియల్ గా మాత్రం ఇంకా ఎనౌన్స్ చేయలేదు. మరి ఫస్ట్ లుక్ పోస్టర్ ఎప్పుడు ఇస్తారో అని ఫ్యాన్స్ అంటా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.