
నాగ చైతన్య హీరోగా నూతన దర్శకుడు కృష్ణ డైరెక్ట్ చేస్తున్న సినిమా యుద్ధం శరణం. వారాహి చలన చిత్ర బ్యానర్లో సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుంది. రాజమౌళి చేతుల మీదుగా ఆడియో రిలీజ్ జరుపుకున్న ఈ సినిమా ట్రైలర్ కూడా ఆయనే రిలీజ్ చేశారు. పరుగెత్తే ప్రతివాడు పారిపోతున్నట్టు కాదు డైలాగ్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది.
అందమైన కుటుంబం దాన్ని చిన్నాభిన్నం చేసే విలన్.. సామాన్యుడు యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో అదే యుద్ధం శరణం సినిమా. సినిమాలో మరో స్పెషల్ ఏంటంటే హీరో శ్రీకాంత్ ఇందులో విలన్ గా నటించడమే. సెప్టెంబర్ 8న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ అయితే ఇంప్రెసివ్ గా అనిపించింది. రారండోయ్ వేడుక చూద్దాం తో హిట్ అందుకున్న చైతు యుద్ధం శరణంతో ఆ హిట్ మేనియా కంటిన్యూ చేస్తాడో లేదో చూడాలి.