విక్రం వేధకు నాగ్ ఓకే..!

కింగ్ నాగార్జున మరో క్రేజీ ప్రజెక్ట్ కు సైన్ చేశారని ఫిల్మ్ నగర్ టాక్. ప్రస్తుతం రాఉ గాది గది-2లో నటిస్తున్న నాగార్జున తన తర్వాత సినిమా ఓ తమిళ సూపర్ హిట్ రీమేక్ లో నటిస్తారని అంటున్నారు. ఈమధ్యనే రిలీజ్ అయిన విక్రం వేధ సినిమా రీమేక్ లో గ్యాంగ్ స్టర్ రోల్ లో నాగార్జున నటించనున్నారట. ఆర్.మాధవన్, విజయ్ సేతుపతి నటించిన విక్రం వేధ సూపర్ హిట్ అయ్యింది.

పుష్కర్, గాయత్రి కలిసి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను శశికాంత్ నిర్మించారు. అసలైతే ఈ రీమేక్ ను రానా, వెంకటేష్ చేస్తే బాగుంటుందని భావించారు కాని వెంకటేష్ ఎందుకో ఈ సినిమా పట్ల అంత సంతృప్తిగా లేడట అందుకే ఆ ఛాన్స్ నాగార్జున అందుకున్నాడు. తనయుల కెరియర్ మీద దృష్టి పెట్టి తన సినిమాలను కాస్త లైట్ తీసుకున్న నాగ్ 2018లో మళ్లీ తిరిగి వరుస సినిమాలు చేయాలని చూస్తున్నాడు.