
యంగ్ టైగర్ హోస్ట్ గా స్టార్ మాలో వస్తున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. వారం మొత్తం ఎలా ఉన్నా సరే శని ఆదివారాల్లో తారక్ సందడితో ఈ ప్రోగ్రాం మంచి రేటింగ్స్ తో దూసుకెళ్లిపోతుంది. అంతేకాదు రిలీజ్ కాబోతున్న సినిమా ప్రమోషన్స్ కు ఈ బిగ్ బాస్ మంచి ప్లాట్ ఫాం అయ్యింది. నేనే రాజు నేనే మంత్రి రానాతో పాటుగా ఆనందో బ్రహ్మ కోసం తాప్సీ, అర్జున్ రెడ్డి గురించి విజయ్ కూడా బిగ్ బాస్ హౌస్ లో వెళ్లి ఆ హౌజ్ మెట్స్ తో కాసేపు ఆడుకుని వచ్చాడు.
ఇక ఇప్పుడు సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతున్న బాలయ్య పైసా వసూల్ కు కూడా బిగ్ బాస్ ప్రమోషన్ అందుతుందా అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. బాలయ్య బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తాడా.. అబ్బాయ్ చేస్తున్న ఈ షోకి బాలయ్య వస్తే ఎలా ఉంటుంది అన్న చర్చలు మొదలయ్యాయి. ఏమో వారి మధ్య దూరం ఎలా ఉన్నా సినిమా కోసం కాబట్టి బాలయ్య ప్రమోషన్ కు బిగ్ బాస్ కు వచ్చినా రావొచ్చని అంటున్నారు. మొత్తానికి బిగ్ బాస్ లో బాలయ్య ఎంట్రీ టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.