రాజు గారి గది-2 టైటిల్ లోగో..!

ఓంకార్ డైరక్షన్ లో లాస్ట్ ఇయర్ చిన్న సినిమాగా వచ్చిన పెద్ద విజయం అందుకున్న రాజు గారి గది గురించి తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకు కొనసాగింపుగా రాజు గారి గది-2 తీస్తున్నారు. నాగార్జున లీడ్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో సమంత కూడా ప్రత్యేక పాత్ర చేస్తుంది. అశ్విన్,  సీరత్ కపూర్ లీడ్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ లోగో రిలీజ్ చేశారు దర్శక నిర్మాతలు.

మోషన్ పోస్టర్ అదరగొట్టగా ఆ పోస్టర్ కోసం థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అబ్బో అదిరిపోయింది. సినిమా మీద ఓ పాజిటివ్ అప్పీల్ కలిగేలా చేసిన ఈ టైటిల్ లోగో అంచనాలను పెంచేసిందని చెప్పొచ్చు. నాగార్జున భారీ అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా దసరా బరిలో దించాలని చూస్తున్నారు.