సంబంధిత వార్తలు

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ బాబి డైరక్షన్ లో వస్తున్న సినిమా జై లవ కుశ. సినిమాలో తారక్ మూడు పాత్రలు చేస్తున్నాడు. జై గా అదరగొట్టిన తారక్ నిన్న లవ కుమార్ గా సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఇక ఈరోజు వినాయక చవితి సందర్భంగా కుశ ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. స్టైలిష్ లుక్ తో వచ్చిన కుశ లుక్ సినిమా మీద అంచనాలను మరింత పెంచేసింది.
ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ పతాకంలో నందమూరి కళ్యాణ్ రాం నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. రాశి ఖన్నా, నివేథా థామస్ లాంటి క్రేజీ హీరోయిన్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. దసరా బరిలో సెప్టెంబర్ 21న రిలీజ్ అవుతున్న ఈ జై లవ కుశ ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.