
పవర్ స్టార్ పవన్ కళ్యాన్ త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఫస్ట్ లుక్ గురించి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ కాబోతుంది. ఈ విషయం హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ అఫిషియల్ సోషల్ బ్లాగ్ లో ఎనౌన్స్ చేశారు. అయితే ఏమైందో ఏమో కాని మళ్లీ ఈ పోస్టర్ ను వారు తొలగించేశారు.
ఎవరు చెప్పినా చెప్పకున్నా సరే పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ మాత్రం ఆరోజు వచ్చి తీరుతుందని తెలుస్తుంది. జల్సా, అత్తారింటికి దారేది సినిమాల తర్వాత హ్యాట్రిక్ కాంబినేషన్ గా రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్, అను ఇమాన్యుయెల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.