
సుకుమార్ డైరక్షన్ లో మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా వస్తున్న సినిమా రంగస్థలం 1985. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా 2018 సంక్రాంతి రిలీజ్ అని ఎనౌన్స్ చేశారు. కాని ఈ సినిమా సంక్రాంతికి కష్టమే అంటున్నారు. సుకుమార్ నిర్మాణంలో దర్శకుడు సినిమాకు కొంత టైం కేటాయించగా ఇప్పుడు సై..రా నరసింహారెడ్డి కోసం చరణ్ రంగస్థలం కు కాస్త గ్యాప్ ఇస్తున్నాడట.
సినిమా దర్శకుడు, హీరో వల్ల సినిమా అనుకున్న టైం కల్లా రాలేకపోతుందట. 2018 సంక్రాంతి రిలీజ్ అనుకోగా అది ఏప్రిల్ దాకా వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది. పల్లెటూరి ప్రేమకథతో సుకుమార్ సినిమాల్లోనే కొత్తగా రాబోతున్న రంగస్థలం మూవీ కచ్చితంగా రాం చరణ్ కెరియర్ లో గొప్ప సినిమాగా మిగిలిపోతుందని అంటున్నారు.