
నందమూరి బాలకృష్ణ 102వ సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. కె.ఎస్ రవికుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలయ్య డ్యుయల్ రోల్ పోసిస్తున్నారని ఎక్స్ క్లూజివ్ న్యూస్. 100వ సినిమా శాతకర్ణి సక్సెస్ తర్వాత బాలయ్య కెరియర్ లో జోష్ పెంచుకున్నారు. పూరి డైరక్షన్ లో రాబోతున్న పైసా వసూల్ రిలీజ్ హంగామా ఓ పక్క నడుస్తున్నా 102వ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు బాలయ్య.
సినిమాలో డ్యుయల్ రోల్ అంటే కచ్చితంగా మరో హీరోయిన్ కు అవకాశం ఉంటుంది. అయితే నయనతార కాకుండా ఈ సినిమాలో మరో ఇద్దరు హీరోయిన్స్ కు ఛాన్స్ ఉందని తెలుస్తుంది. మాస్ లుక్ లో కనిపించే ఈ సినిమా తండ్రి కొడుకులుగా బాలయ్య కనిపిస్తారని టాక్. మరి కథ ఏంటన్నది సినిమా వస్తేనే కాని చెప్పలేం ఈ గ్యాప్ లో ఇలాంటి కథలు ఎన్నో పుట్టుకొస్తాయి వాటిలో ఏది నమ్మలేం.