
బిగ్ బాస్ తో బుల్లితెర మీద కూడా సందడి చేస్తున్న యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తన మార్క్ అభినయంతో అదరగొడుతున్నాడు. స్టార్ మా నిర్వహిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక రియాలిటీ షో బిగ్ బాస్ మొదటి సీజన్ అనుకున్న రేంజ్ కన్నా ఎక్కువగానే సక్సెస్ అయినట్టు తెలుస్తుంది. ఈ సీజన్ లో 7 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చి మరి ఎన్.టి.ఆర్ ను తీసుకున్నారు దానికి తగినంత న్యాయం జరుగుతుంది. అందుకే సెకండ్ సీజన్ లో కూడా ఆయన్నే కంటిన్యూ చేసే ఆలోచనలో ఉన్నారట.
తన హోస్టింగ్ టాలెంట్ తో స్టార్ మాని టాప్ ప్లేస్ లో ఉంచుతున్న తారక్ బిగ్ బాస్ సీజన్-2 ని కూడా తనే చేస్తాడని అంటున్నారు. ఇక సీజన్-2 కొత్త కంటెస్టంట్స్ తో రాబోతుంది. ప్రస్తుతం మొదటి సీజన్ లో 39 రోజులు పూర్తి చేసుకోగా ఇద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం 12 మంది హౌజ్ మెట్స్ ఉన్న బిగ్ బాస్ హౌజ్ లో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. వెండితెర మీదే కాదు బుల్లితెర మీద కూడా ఎన్టీఆర్ చూపిస్తున్న ఈ నట విశ్వరూపం బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.