
మలయాళ భామలకు టాలీవుడ్ లో మంచి సక్సెస్ లు వస్తున్నాయి. ఎంట్రీ ఇవ్వడమే ఆలస్యం స్టార్ అవకాశాలు వచ్చి పడుతుంటాయి. ఈ క్రమంలో నాచురల్ స్టార్ నానితో మజ్ఞు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అను ఇమ్మాన్యుయెల్ కు వరుసగా లక్కీ ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం త్రివిక్రం పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో నటిస్తున్న అను ఇమ్మాన్యుయెల్ ఇప్పుడు అదే డైరక్టర్ తో మరో లక్కీ ఛాన్స్ దక్కించుకుందట.
ఎన్నాళ్ల నుండో క్రేజీ కాంబినేషన్ గా అనుకుంటున్న త్రివిక్రం ఎన్.టి.ఆర్ సినిమా నవంబర్ మొదటి వారంలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాలో మొదట కాజల్ ను హీరోయిన్ గా అనుకోగా ఇప్పుడు ఫైనల్ గా అను ఇమ్మాన్యుయెల్ ను ఫిక్స్ చేశారట. ఇదే కాకుండా అల్లు అర్జున్ నటిస్తున్న నా పేరు సూర్యలో కూడా ఛాన్స్ దక్కించుకుంది అను చూస్తుంటే అమ్మడు టాలీవుడ్ లో కాబోయే స్టార్ హీరోయిన్ అనిపిస్తుంది.