
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ట్రిపుల్ రోల్ చేస్తున్న జై లవ కుశ సినిమా నుండి సెకండ్ టీజర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయ్యింది. లవ కుమార్ గా కూల్ లుక్స్ తో కనిపించిన ఎన్.టి.ఆర్ తన మంచితనం తన జీవితాన్ని తలకిందులు చేసిందని చెబుతాడు. ఇక టీజర్ అలా రిలీజ్ అయ్యిందో లేదో ఫ్యాన్స్ లో ఉత్సాహన్ని నింపుతుంది.
బాబి డైరక్షన్ లో ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ పతాకంలో వస్తున్న జై లవ కుశ సెప్టెంబర్ 21న రిలీజ్ అవుతుంది. రాశి ఖన్నా, నివేథా థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. జై టీజర్ తో పాటు లవ కుమార్ టీజర్ కూడా సినిమా మీద అంచనాలను పెంచేసింది. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలంటే దసరా వరకు వెయిట్ చేయాల్సిందే.