సంబంధిత వార్తలు

వెంకటేష్-మారుతీ కాంబినేషన్లో రూపోదిద్దుకుంటున్న బాబు బంగారం సినిమాకి సంబంధించిన టీజర్ ఈరోజు విడుదలైంది. మారుతి సినిమా అనగానే కుటుంబం తో కలిసి వెళ్ళాలంటే భయపడతారు. అయితే 'కొత్త జంట' సినిమా దగ్గరి నుండి, ఈ డైరెక్టర్ తన పంధా మార్చుకున్నట్టున్నాడు. ముఖ్యంగా బాబు బంగారం టీజర్ పూర్తి వినోద భరితంగా ఉంది తప్ప, మారుతి స్టైల్ లోని ఆ బూతు సీన్లు లేవనే అర్ధమవుతుంది.
బొబ్బిలి రాజా సినిమాలో 'అయ్యో అయ్యో అయ్యయ్యో' అనే తన పాపులర్ డైలాగ్ మళ్ళీ ఈ కొత్త సినిమాలో ఉపయోగించడం విశేషం. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి 'రన్ రాజా రన్' ఫేం 'ఘిబ్రన్' సంగీతం అందిస్తున్నారు.