
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ గా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ సినిమా 'సైరా నరసింహారెడ్డి'. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో అత్యంత భారీ బడ్జెట్ తో భారీ స్టార్ కాస్ట్ తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన మోషన్ పోస్టర్ తోనే కాదు సినిమాలో నటించే ఆర్టిస్టులతో కూడా ఆడియెన్స్ ను సర్ ప్రైజ్ చేశారు దర్శక నిర్మాతలు. ముఖ్యంగా సినిమాలో సెహెన్షా ఆఫ్ ఇండియన్ సినిమా అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారన్న న్యూస్ మెగా అభిమానుల్లో రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చింది. అంతేకాదు బిగ్ బీ చేరికతో ఈ సినిమా మరో లెవల్ కు వెళ్లింది.
సినిమాలో నటిస్తున్న అమితాబ్ రోల్ పై ఇప్పటి నుండే చర్చలు మొదలయ్యాయి. నరసింహారెడ్డి గురువుగా బిగ్ బీ కనిపిస్తారని అంటున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి తన గురువు అంటే చాలా గౌరవం.. ఆయన చరిత్రలో గురువుది ప్రత్యేక స్థానం ఉంది. అందుకే ఈ పాత్రకు అమితాబ్ సై అన్నాడని తెలుస్తుంది. ఎన్నోసార్లు సౌత్ సినిమాల్లో నటించే ఛాన్స్ వచ్చినా వదులుకున్న అమితాబ్ ఈ అవకాశాన్ని మాత్రం పట్టుకున్నారు. మరి ఒకే స్క్రీన్ పై అమితాబ్, చిరంజీవి కాంబినేషన్ ఎలా ఉండబోతుందో చూసేందుకు ఆడియెన్స్ అందరు వెయిట్ చేస్తున్నారు.